ముందుగా పరమేశ్వరునికి, గురువులకు, తల్లి దండ్రులకు, మా వినమ్ర ప్రణామములు.
అంతర్జాతీయ తెలుగు బడిది జగమంత కుటుంబం..
అంతర్జాతీయ తెలుగు బడి వంటి ఆశయ సాధన ఎందరో మహానుభావుల, శ్రేయోభిలాషుల ఆశీర్వాద బలం వలన, ఆలోచనా సహకారాల వలననే సాధ్యం. వారందరికీ పేరుపేరునా ధన్య వాదములు.
తమ భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకొని, పరివ్యాప్తి చేయాలనే పట్టుదలతో, తమ పిల్లల భవిష్యత్తుపై గంపెడాశలతో, ప్రపంచ వ్యాప్తంగా, స్వచ్చంద ఉపాధ్యాయులుగా సహకరిస్తున్న, సామాజిక సేవా దురంధరులు, భాషాభిమానులు అయిన, తల్లిదండ్రులు ఈ అంతర్జాతీయ తెలుగు బడికి మూల స్తంభాలు. వారందరికీ శత సహస్ర నమస్సుమాంజలులు.
ఇటువంటి కార్య క్రమాల నిర్వహణకు సామాజిక సేవా నిరతి గలిగిన దాతలు, సంస్థల సహాయం కూడా చాలా అవసరం. వాటిలో కొన్ని..
ఆస్టిన్ హిందూ మందిరం
ఆస్టిన్ తెలుగు సాంస్కృతిక సంఘం
మర్చిసన్ మిడిల్ స్కూల్
నార్త్ ఆస్టిన్ మేథ్ నేషియం
టేపెస్ట్రీ డాన్స్ స్టుడియా
చిన్మయ సుందరం, ఆస్టిన్
చిన్మయ మిషన్ వెస్ట్ మరియు ఇతర చిన్మయ కేంద్రములు