మన కార్యక్రమములు
- ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ తెలుగు బడుల నిర్వహణ మరియు అనుసంధానము.
- పద్యపఠనము, వక్తృత్వము, వ్యాసరచన వంటి పోటీల నిర్వహణ, తద్వారా భాషాబోధన మరియు భాషాభివృద్ధికి తోడ్పాటు.
- మీ ఊళ్ళో లేదా మీ ఇంట్లో అంతర్జాతీయ తెలుగుబడి ప్రారంభమునకు మరియు నిర్వహణకు సహకరించడం.
- “అంతర్జాతీయ బాల శిక్ష®” పాఠ్య ప్రణాళిక ప్రచురణ మరియు వితరణ.
- తెలుగు భాషా బోధనకు సహకరించు ఉపకరణముల అభివృద్ధి.
- తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు శిక్షణ మరియు సహకారం.
- తెలుగు భాషా, సంస్కృతుల బోధన మరియు అభ్యాసములను ప్రోత్సహించడం.
- సాహితీసదస్సులు, అవధానములు వంటి భాషాసాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం మరియు ప్రోత్సహించడం.
- అంతర్జాతీయ భాషగా తెలుగును అభివృద్ధి చేయడం.
- తెలుగు భాష మరియు తెలుగు సంస్కృతి అభివృద్ధికి తోడ్పడే ఇతర స్వచ్ఛంద సామాజిక సేవాసంస్థలతో కలిసి పనిచేయడం.